BIG STORY: దలైలామా వారసుడి ఎంపిక పై కేంద్రం కీలక నిర్ణయం!
BIG STORY: దలైలామా వారసుడి ఎంపిక వేళ ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో కేంద్రం ప్రత్యేక బంగ్లా కేటాయింపు.
BIG STORY: దలైలామా వారసుడి ఎంపిక పై కేంద్రం కీలక నిర్ణయం!
BIG STORY: టిబెట్ బౌద్దమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో పావులు వేగంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాజధానీ నగరమైన ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో దలైలామాకు ఒక ప్రత్యేక బంగ్లాను కేటాయించినట్లు సమాచారం అందింది.
పండిట్ రవిశంకర్ లేన్ లోని ఓ నివాసాన్ని దలైలామాకు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాల కథనం. దలైలామా కార్యాలయం....గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కు ఈ బంగ్లాను కేటాయించినట్లు తెలిసింది. విదేశీ మంత్రిత్వ శాఖ విగ్నప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇటువంటి ప్రభుత్వ నివాసాల కేటాయింపు కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి గడువు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. కాగా దలైలామా సంస్థను పరిరక్షించడం అలాగే ఆయన ఆధ్యాత్మిక సేవలను కొనసాగించడం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. మానవతా విలువల ప్రచారం, టిబెట్ సంస్క్రతిని కాపాడుకోవడం, భారతీయ గ్నానాన్ని ప్రోత్సహించడంలోనూ ఈ ట్రస్ట్ పనిచేస్తుంది.
మరోవైపు దలైలామా వారసుడి ఎంపిక విషయమై భారత్ తోనే చర్చలు జరపాలని అమెరికా కమిషన్ సూచించింది. అంతేకాదు ..వారసుడి ఎంపిక ప్రక్రియలో చైనా జోక్యం చేసుకోకుండా చూడాలని ప్రత్యేకంగా వెల్లడించింది. అలాగే తదుపరి దలైలామాను ఎంపిక చేసే అధికారం కేవలం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కే ఉండాలని అమెరికా కమిషన్ గట్టిగా చెప్పింది.
ఒక దశలో ఈ ప్రక్రియలో చైనా జోక్యం చేసుకునే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు అనుకూలమైన వ్యక్తిని దలైలామా వంటి అత్యున్నత పదవిలో కూర్చోబెట్టడానికి చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు అందిందని కూడా అమెరికా కమిషన్ పేర్కొంది.
కాగా దలైలామా వారసత్వ ప్రక్రియ రాజకీయ, భద్రతాపరమైన చిక్కులకు సంబంధించి భారతదేశంతో ప్రత్యేక చర్చలను ప్రారంభించాలని అమెరికా విదేశాంగ కార్యదర్శికి కమిషన్ సిఫార్సు చేసింది. అలాగే కేవలం ప్రభుత్వ ప్రతినిధులతోనే కాకుండా నిపుణులు, వ్యూహాత్మక వర్గాలతో కూడా సంప్రదింపులు జరపాలని అమెరికా కమిషన్ సూచించింది.
అన్నిటికంటే ముఖ్యంగా చైనా ఎంచుకున్న ఏ వారసుడికీ అంతర్జాతీయ గుర్తింపు లభించకుండా చూసేందుకు, అమెరికా తన మిత్రదేశాలు, భాగస్వాములతో సమన్వయం చేసుకోవాలని ఈ నివేదిక సలహా ఇచ్చింది.
దలైలామా వారసుడిని నిర్ణయించే ప్రక్రియను ప్రభావితం చేయడానికి చైనా సైబర్ దాడులు, ఏఐ ఆధారిత తప్పుడు సమాచార ప్రచారాలకు పాల్పడవచ్చని ఒక అమెరికా కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ తన సైబర్ భద్రతను బలోపేతం చేసుకోవాలని కోరింది.
అలాగే తప్పుడు సమాచార ప్రచారాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. వారసుడి ఎంపిక విషయంలో చైనా రాజకీయ ప్రభావాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ సమన్వయం అత్యవసరం అని కూడా అమెరికా కమిషన్ సూచించింది.
దలైలామా వారసుడి ఎంపిక అనేది చిన్న విషయం కాదు. అదొక సంక్లిష్ట ప్రక్రియ. ఈ నేపథ్యంలో దలైలామాకు బారత్ ఏకంగా ఢిల్లీలో ఒక ప్రత్యేక బంగ్లా కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది.




