Big Debate: SIRలో 13.5 లక్షల ఓట్లు పెండింగ్.. అసలేం జరుగుతోంది? hmtv బిగ్ డిబేట్ విశేషాలు!
Big Debate: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో 13.5 లక్షల ఓట్లు పెండింగ్లో ఉండటంపై hmtv నిర్వహించిన బిగ్ డిబేట్ విశేషాలు.
Big Debate: SIRలో 13.5 లక్షల ఓట్లు పెండింగ్.. అసలేం జరుగుతోంది? hmtv బిగ్ డిబేట్ విశేషాలు!
Big Debate: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 3.3 కోట్ల ఓట్లు ఉండగా, ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన వారిలో దాదాపు 87 లక్షల మందికి పైగా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు స్పందించి 58.5 లక్షల మందికి పైగా పౌరులు రిప్లై ఇచ్చి, అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ.. వారిలో 13.5 లక్షల మంది ఓట్లు ఇంకా పెండింగ్లోనే ఉండటం గందరగోళానికి దారితీసింది. ఈ అంశంపై hmtv నిర్వహించిన 'బిగ్ డిబేట్'లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి మరియు ఇతర నిపుణులు పాల్గొని పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా బీఎల్ఓల (BLO) పాత్ర కీలకంగా ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో సరైన పద్ధతిలో నోటీసులు అందకపోవడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగిందని పద్మనాభ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.




