Big Debate: 92 లక్షల నోటీసులు.. 58 లక్షల రిప్లైలు.. 13.5 లక్షల ఓట్లపై క్లారిటీ ఏది? hmtv బిగ్ డిబేట్ విశేషాలు!

Big Debate: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో 13.5 లక్షల ఓట్లు పెండింగ్‌లో ఉండటంపై hmtv నిర్వహించిన బిగ్ డిబేట్ విశేషాలు.

Arun Chilukuri
Published on: 30 Sept 2026 12:13 PM IST
Big Debate: 92 లక్షల నోటీసులు.. 58 లక్షల రిప్లైలు.. 13.5 లక్షల ఓట్లపై క్లారిటీ ఏది? hmtv బిగ్ డిబేట్ విశేషాలు!
X

Big Debate: 92 లక్షల నోటీసులు.. 58 లక్షల రిప్లైలు.. 13.5 లక్షల ఓట్లపై క్లారిటీ ఏది? hmtv బిగ్ డిబేట్ విశేషాలు!

Big Debate: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని hmtv నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన వారిలో దాదాపు 92 లక్షల మందికి అధికారులు నోటీసులు జారీ చేయగా, అందులో 58 లక్షలకు పైగా పౌరులు స్పందించి తాము అడిగిన డాక్యుమెంట్లు సమర్పించారని తెలిపారు. అయితే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి నోటీసులకు రిప్లై ఇచ్చినప్పటికీ, వారిలో దాదాపు 13.5 లక్షల మంది ఓట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది.

ఉద్యోగులు, దైనందిన జీవితంలో తీరిక లేని సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయలేరన్నంత మాత్రాన, వారు అన్ని ప్రక్రియలు పూర్తి చేసినప్పటికీ వారి ఓటు హక్కును అనిశ్చితిలో పెట్టడం సరికాదని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.