Chandragiri: చంద్రగిరిలో ఘనంగా ప్రపంచ నదుల దినోత్సవం
Chandragiri: ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరి కళ్యాణి డ్యాం వాగు పరిసరాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ NSS, NCC ఆధ్వర్యంలో స్వచ్ఛత డ్రైవ్ నిర్వహించారు.
Chandragiri: చంద్రగిరిలో ఘనంగా ప్రపంచ నదుల దినోత్సవం
Chandragiri: ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వద్ద గురువారం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా బృహత్తర స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. మోహన్ బాబు యూనివర్సిటీ, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) తిరుపతి 29వ బెటాలియన్ NCC సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్లీనింగ్ డ్రైవ్‌లో విద్యార్థులు, NCC కేడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు పిలుపు మేరకు రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా, కళ్యాణి డ్యాం వాగు బ్రిడ్జికి ఇరువైపులా దాదాపు 500 మీటర్ల మేర పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు పిచ్చి ముళ్ల పొదలను కేడెట్లు శ్రమదానం చేసి తొలగించారు. పరిసర ప్రాంతాలు మళ్లీ కొత్త శోభను సంతరించుకునేలా శ్రమించారు.
ఈ సందర్బంగా మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీవీ రమణ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక రోజుతో ముగిసే కార్యక్రమం కాదని, పర్యావరణాన్ని, నదులను కాపాడుకోవాలనే ముందస్తు ప్రణాళికతో రెండు వారాల పాటు ప్రతిరోజూ కళ్యాణి డ్యాం వాగు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ డిఎఫ్వో రవి శేఖర్, హెచ్ఓడి సివిల్ ఇంజనీరింగ్ డాక్టర్ ఎస్.ఎస్. మనుగుల, ఎన్.సి.సి గ్రూప్ కమాండర్ ఆఫీసర్ కల్నన్ విక్రమ్ ప్రసన్న, అడ్మిన్ ఆఫీసర్ లెఫ్ట్ లెన్ట్ కల్నన్ దివ్య సింగ్, యూనివర్సిటీ సిబ్బంది, ఎన్.సి.సి క్యాడెట్లు పాల్గొన్నారు.




