Tirupati: ప్రతిపక్షంలో ఉన్నా అధికారం ఉన్నట్లు విర్రవీగితే సహించేది లేదు: కూటమి

Tirupati: వైసీపీకి ఇంకా అధికార మత్తు దిగలేదని, ప్రతిపక్షంలో ఉండి రౌడీయిజం చేస్తే సహించేది లేదని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 17 Oct 2026 6:10 PM IST
Tirupati
X

Tirupati: ప్రతిపక్షంలో ఉన్నా అధికారం ఉన్నట్లు విర్రవీగితే సహించేది లేదు: కూటమి

Tirupati: ప్రజలు తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీ నాయకులు ఇంకా అధికార మదం తోనే వ్యవహరిస్తున్నారని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు సంయుక్తంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు పాల్పడిన అరాచకాలు, భయోత్పాతాలే నిన్నటి పుంగనూరు ఘటనకు మూలకారణమని నేతలు స్పష్టం చేశారు. ఓటమి భయంతో ఎన్నికల వేళ హింసాత్మక రాజకీయాలు చేసిన వైసీపీ నాయకులు, నేటికీ అదే అరాచక వైఖరిని కొనసాగించాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు.

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చి అధికారం నుంచి దించినప్పటికీ, ఎల్లకాలం తామే అధికారంలో ఉన్నామనే భ్రమల్లో వైసీపీ నేతలు బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం పోయినా అరాచక బుద్ధి పోలేదని, సమాజంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దాడులు, దౌర్జన్యాలకు తెగబడటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ల అరాచక పాలన ముగిసిపోయిందనే వాస్తవాన్ని వైసీపీ నాయకులు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ: రాష్ట్రంలో కొలువుదీరిన తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం పూర్తిగా నిష్పక్షపాత ప్రభుత్వమని నేతలు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగుతుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ మాట్లాడుతూ:కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దౌర్జన్యాలు, హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వైసీపీ నాయకులు తక్షణమే తమ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు. ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దోషులను చట్టపరంగా శిక్షిస్తుందని తేల్చిచెప్పారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL