Renigunta: రేణిగుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి!
Renigunta: శ్రీకాళహస్తి–తిరుపతి జాతీయ రహదారిపై వెదలచెరువు ఉగాది హోటల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సుమారు 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.
Renigunta: రేణిగుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి!
రేణిగుంట: శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్లే జాతీయ రహదారిపై వెదలచెరువు ఉగాది హోటల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 60 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు వివరాలు వెల్లడించారు.
మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, మాసిన గడ్డం, జుట్టు కలిగి ఉన్నాడని తెలిపారు. ప్రమాద సమయంలో ఎర్రటి చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉండగా, లుంగీకి నల్లటి బెల్టు ధరించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మృతుడి వివరాలు తెలిసినవారు, బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మృతుడి గుర్తింపు కోసం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




