Renigunta: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి!

Renigunta: రేణిగుంట తిరుచనూరు మధ్య రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి కుడిచేతిపై 'జై శ్రీరామ్' పచ్చబొట్టు ఆచూకీ కోసం రేణిగుంట రైల్వే పోలీసుల విజ్ఞప్తి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Sept 2026 4:15 PM IST
Renigunta
X

Renigunta: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి!

రేణిగుంట: రేణిగుంట – తిరుచనూరు ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య అప్‌ లైన్ రైలు పట్టాలపై ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి సుమారు 37 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రేణిగుంట రైల్వే పోలీసులు (GRP) తెలిపారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం 8:20 గంటలకు ముందు చోటుచేసుకుంది.

​మృతుని వివరాలు:

​వయస్సు: సుమారు 37 సంవత్సరాలు

​దుస్తులు: నారింజ (ఆరెంజ్) రంగు షార్ట్, తెలుపు రంగు టీ-షర్ట్

​గుర్తులు: మృతుని కుడి చేతిపై హిందీ భాషలో "జై శ్రీరామ్" అని పచ్చబొట్టు (టాటూ) వేసి ఉంది.

​మృతునికి సంబంధించిన పేరు, చిరునామా తదితర వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

​పై వివరాల ఆధారంగా మృతుని ఆచూకీ తెలిసిన వారు లేదా బంధువులు వెంటనే రేణిగుంట జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి 9247575621 నంబరులో సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA