Renigunta: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. గ్లౌజులు లేకుండానే ఆహార పదార్థాల తయారీ!
Renigunta: రేణిగుంటలోని ప్రముఖ రెస్టారెంట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల తయారీ. గ్లౌజులు, క్యాప్‌లు లేకుండా వంటలు వండుతుండటంతో కస్టమర్ల ఆరోగ్యంపై ఆందోళన.
Renigunta: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. గ్లౌజులు లేకుండానే ఆహార పదార్థాల తయారీ!
Renigunta: రుచి, శుభ్రతకు మారుపేరుగా నిలవాల్సిన ఓ ప్రముఖ రెస్టారెంట్ కస్టమర్ల ఆరోగ్యంతో దారుణంగా చెలగాటమాడుతోంది. కాసుల కక్కుర్తితో కనీస పరిశుభ్రతను గాలికొదిలేసి, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. రేణిగుంట పట్టణంలోని ఓ పేరుమోసిన రెస్టారెంట్లో సిబ్బంది చేతులకు కనీసం గ్లౌజులు (Gloves) కూడా లేకుండానే రోటీలు తయారు చేస్తున్న వ్యవహారం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
హోటల్‌కు వెళ్లే కస్టమర్లు తాము తినే ఆహారం శుభ్రమైన వాతావరణంలో తయారవుతుందని నమ్మి జేబులు గుల్ల చేసుకుంటారు. కానీ, ఆ నమ్మకాన్ని సదరు రెస్టారెంట్ యాజమాన్యం మంటగలుపుతోంది. వంటగదిలో పని చేసే సిబ్బంది కనీస ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. మురికి చేతులతో, ఎలాంటి గ్లౌజులు పిండిని పిసకడం,రోటీలు కాల్చడం,వంట మాస్టర్లు హెడ్ క్యాప్‌లు ధరించకుండ చూస్తే ఎవరికైనా వికారం కలగక మానదు.
ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆహారం తింటే ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే తీవ్ర ప్రమాదం ఉంది. రెస్టారెంట్ వంటగదిలో ఇంత నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్న
వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి మామూళ్లు దండుకుంటున్నారా? లేక ఇలాంటి బడా రెస్టారెంట్ల ఆగడాలు వారి కంటికి కనిపించడం లేదా? అని ప్రజలు మండిపడుతున్నారు.
కస్టమర్ల ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేని ఇలాంటి రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు,పంచాయతీ అధికారులు తక్షణమే ఉక్కుపాదం మోపాలి.ఆకస్మిక దాడులు నిర్వహించి, కనీస ఆరోగ్య ప్రమాణాలు పాటించని రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే లైసెన్సులు రద్దు చేసి సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




