Renigunta: రేణిగుంటలో రూ.1.2 కోట్ల కాపర్ వైర్ చోరీ కేసు ఛేదన ఇద్దరి అరెస్ట్!
Renigunta: రేణిగుంటలో రూ.1.2 కోట్ల విలువైన కాపర్ వైర్ చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Renigunta: రేణిగుంటలో రూ.1.2 కోట్ల కాపర్ వైర్ చోరీ కేసు ఛేదన ఇద్దరి అరెస్ట్!
Renigunta: రేణిగుంట వద్ద రూ.1.20 కోట్ల విలువైన కాపర్ వైర్ చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చోరీకి గురైన 7 టన్నుల కాపర్ వైర్‌తో పాటు రవాణాకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
బెంగళూరులోని వేదాంత లిమిటెడ్–స్టార్‌లైట్ కాపర్ కంపెనీ నుంచి 7 టన్నుల కాపర్ వైర్‌తో శ్రీసిటీకి బయలుదేరిన లారీ (TN 23 DC 4177) చోరీకి గురైంది. లారీ డ్రైవర్ వినోద్ కుమార్ అధిక లాభాల ఆశతో తన అనుచరులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వేలూరు సమీపంలో కాపర్ వైర్‌ను గుంతలో పాతిపెట్టి, లారీని రేణిగుంటలోని రమణ విలాస్ సర్కిల్ వద్ద వదిలేసినట్లు వెల్లడించారు.
కాపర్ వైర్‌కు కొనుగోలుదారులు దొరకకపోవడంతో లారీని తీసుకెళ్లేందుకు వచ్చిన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన ఆర్. రాజా (35), కె. నవీన్ కుమార్ (39)లను పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.20 కోట్ల విలువైన 7 టన్నుల కాపర్ వైర్, లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న వినోద్ కుమార్, దినేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన మురళి, రమేష్, చలపతి, రాజశేఖర్, బాబుషా, శ్రీను, గౌరి నాయుడు, హేమంత్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చోరీలు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు సూచించారు.




