Tirupati: తనపల్లిలో కూటమి ప్రచార హోరు: తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి

Tirupati: తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల తరఫున విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 3 Nov 2026 7:24 PM IST
Tirupati
X

Tirupati: తనపల్లిలో కూటమి ప్రచార హోరు: తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం, తనపల్లి పంచాయతీలో కూటమి ఎంపీటీసీ తొండూరు పీరమ్మ, జడ్పీటీసీ ముచ్చేలి ధన లక్ష్మి అభ్యర్థుల తరపున తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి గారు నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది.

గ్రామంలోకి అడుగుపెట్టినప్పటి నుండే కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో,యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తనపల్లి పంచాయతీలోని ప్రతి వీధిలో, ప్రతి గడపకూ తిరుగుతూ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలో, ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రభుత్వ నిధులను నేరుగా గ్రామాలకు తీసుకువచ్చి తనపల్లి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ప్రజలందరూ అభివృద్ధి వైపు నిలబడి, మన అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి" అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తనపల్లి పంచాయతీ కూటమి ముఖ్య నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL