Renigunta: అంకాళమ్మ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు!

Renigunta: తిరుపతి పాత రేణిగుంట రోడ్డులోని శ్రీ అంకాళమ్మ దేవస్థానంలో జరగనున్న శరన్నవరాత్రుల ఉత్సవాలకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆహ్వానించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 7 Oct 2026 3:15 PM IST
Renigunta
X

Renigunta: అంకాళమ్మ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు!

Renigunta: తిరుపతి పాత రేణిగుంట రోడ్డులోని శ్రీ అంకాళమ్మ దేవస్థానంలో నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్‌అఫిషియో మెంబర్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఉత్సవాల ఆహ్వాన పత్రికను డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అందజేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA