Renigunta: రేణిగుంట మండలంలో కూటమి క్లీన్ స్వీప్ లక్ష్యం!

Renigunta: రేణిగుంట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కూటమి నాయకులతో తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 21 Oct 2026 9:46 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో కూటమి క్లీన్ స్వీప్ లక్ష్యం!

Renigunta: స్థానిక సంస్థల ఎన్నికల్లో రేణిగుంట మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా రేణిగుంట మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కమిటీల సన్నద్ధత, ఓటర్ల జాబితాల పరిశీలన, ఎన్నికల వ్యూహాలపై నాయకులతో చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమైనవని, ప్రతి స్థానంలోనూ అత్యధిక మెజారిటీ సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విజయానికి కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రేణిగుంట మండల కూటమి నాయకులు, సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA