Tirumala: శ్రీవారి ప్రసాదాల నాణ్యత పర్యవేక్షణ..13 మంది పోటు వర్కర్లకు పదోన్నతులు!

Tirumala: తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు 13 మంది పోటు వర్కర్లకు 'పోటు సూపర్‌వైజర్లు'గా టీటీడీ పదోన్నతులు కల్పించింది.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 14 Oct 2026 12:35 PM IST
Tirumala
X

Tirumala: శ్రీవారి ప్రసాదాల నాణ్యత పర్యవేక్షణ..13 మంది పోటు వర్కర్లకు పదోన్నతులు!

Tirumala: కలియుగ దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రసాదాల తయారీ, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న 13 మంది పోటు వర్కర్ సీనియర్లకు 'పోటు సూపర్‌వైజర్లు'గా పదోన్నతి కల్పించింది.

ఆలయంలో పదోన్నతి ఉత్తర్వుల అందజేత

శ్రీవారి సింహ వాహనసేవ అనంతరం బుధవారం తిరుమల ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరి చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఉద్యోగులకు ఉత్తర్వులు అందజేశారు.

ప్రభుత్వం ఆమోదంతో నెరవేరిన కల

ఏళ్ల తరబడి పోటు వర్కర్ సీనియర్లుగా సేవలందిస్తున్న వీరికి పదోన్నతి కల్పించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పాలకమండలి సమావేశంలో (Res. No. 576, Dt. 16.12.2025) తీర్మానం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ప్రక్రియ వేగంగా పూర్తయింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రమోషన్ల సమస్యను పరిష్కరించినందుకు పదోన్నతి పొందిన ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.