Renigunta: రేణిగుంటలో వివాహిత ఆత్మహత్య భర్తపై ఆరోపణలు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తారకరామ నగర్‌లో వివాహిత కీర్తి ఆత్మహత్య. భర్త మద్యపానం, కుటుంబ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 Oct 2026 9:19 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో వివాహిత ఆత్మహత్య భర్తపై ఆరోపణలు!

Renigunta: భర్త మద్యపానం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రేణిగుంట మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలానికి చెందిన కీర్తి (30)కి సుమారు 12 ఏళ్ల క్రితం సునీల్ కుమార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతులు రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్‌లో నివాసం ఉంటున్నారు.

భర్త మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలను పట్టించుకోవడం లేదని, ఈ విషయంపై పలుమార్లు పెద్దలు సర్దిచెప్పినా మార్పు రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి తల్లి పేర్కొన్నట్లు సమాచారం. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రాత్రి కీర్తి ఇంటి వరండాలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అర్ధరాత్రి ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA