Renigunta: రేణిగుంటలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన సదస్సు!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్‌లో ఆర్టీవో, డీటీవో ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. వాహన పత్రాలు, ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 12 Oct 2026 1:19 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన సదస్సు!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్‌లో ఆర్టీఓ సుబ్రహ్మణ్యం, డీటీఓ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) తదితర పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

వాహనాలకు సంబంధించిన పత్రాల గడువు ముగియకముందే వాటిని రెన్యువల్ చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు.


JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA