Srikalahasti: శివయ్య సేవలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు!

Srikalahasti: ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ తన సతీమణి నారా శిరీష, కుమారుడు నందనరామతో కలిసి సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 16 Nov 2026 8:06 PM IST
Srikalahasti
X

Srikalahasti: శివయ్య సేవలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు!

శ్రీకాళహస్తి: ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, దివంగత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడైన నారా రోహిత్ తన సతీమణి నారా శిరీష, కుమారుడు నారా నందనరామతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాళహస్తి MGM గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున నాయుడు వారికి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి ఆలయానికి స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ పాలనాధికారి వెంకటేశ్వర్లు, ఉప పాలనాధికారి లోకేష్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం నారా రోహిత్ కుటుంబానికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గుడ్లూరు మల్లికార్జున నాయుడుతో పాటు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, పుట్టపర్తి కొత్తూరుకు చెందిన లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సందీప్, తిరుపతికి చెందిన జనసేన నాయకులు, ఎడిఫై స్కూల్ డైరెక్టర్ పెనుమాడు ప్రణీత్, నారా కుటుంబ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI