Renigunta: రేణిగుంట మండలంలో వైఎస్సార్‌సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య్రర్థుల విజయం కోరి ప్రచారం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 31 Oct 2026 2:40 PM IST
Renigunta
X

Renigunta:రేణిగుంట మండలంలో వైఎస్సార్‌సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం!

Renigunta: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేణిగుంట మండలం,కరకంబాడి తారక రామానగర్ లో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి గంగారి సుజాత గారిని అలాగే ఎంపీటీసీ సభ్యులు నాగరాజ్, హేమలత, దిలీపులను అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం గారు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఒక మంచి మనసున్న నాయకుడు,ఎవరు ఏ సమస్య చెప్పిన ఆయన సమస్యల భావించి ప్రజల పక్షాన నిలిచే రమేష్ గారి సతీమణి గంగారి సుజాత గారిని జడ్పిటిసి అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. అలాగే జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అండగా ఉన్నారని కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని అన్నారు. గడపగడపలో ప్రజలు ఎన్నో సమస్యలు తెలుపుతున్నారని వాళ్ళ బాధను అన్నింటిని ఓటు రూపంలో చూపించబోతున్నారు అన్నారు.జడ్పిటిసి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, తిరుమలరెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి,రమేష్, శ్రీధర్ రెడ్డి,సంధ్య, పురుషోత్తం, సుబ్రహ్మణ్యం, పార్థసారథి, దిలీప్, శివ కుమార్ జయదేవ్ శ్రీను ధర్మ వెంకటయ్య భాస్కర్ కన్నయ్య ఇంటియాద్ మురగయ్య దశరథ ముని కృష్ణయ్య గణేష్ స్వర్ణలత అమ్ములమ్మ హసీనా సాహిదా జయంతి యుగంధర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA