Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం
Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం. ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలమన్న నిపుణులు, విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు.
Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం
తిరుపతి: ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టుల బాధ్యతలు నిరంతరం విస్తరిస్తున్నాయని, వారు కేవలం ఔషధాలను పంపిణీ చేసే వ్యక్తులు మాత్రమే కాదని, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, రోగుల సలహాదారులు, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భాగస్వాములు అని ఎంబీ స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎం. ఆర్. జయప్రకాష్ పేర్కొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించిన 'ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం' వేడుకల్లో ఆయన కీలక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు వృత్తిపరమైన నైతిక విలువలు పాటిస్తూ రోగుల భద్రతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. అలాగే సమాజంలో సూక్ష్మజీవ నిరోధకత పెరుగుతున్న నేపథ్యంలో, యాంటీబయాటిక్స్, ఔషధాల సురక్షిత వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులు నాటకాలు, రంగోలి, సైటూన్స్, పోస్టర్లు మరియు రీల్ మేకింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించారు.
ఫార్మసీ కౌన్సిల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వి. షణ్ముగం మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి, డీన్, అధ్యాపకులు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




