Tirupati: నవంబర్ 30న పరేడ్ మైదానంలో టీటీడీ కార్తీక మహా దీపోత్సవం

Tirupati: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో నవంబర్ 30 రాత్రి కార్తీక మహా దీపోత్సవం జరగనుంది. మహిళా భక్తుల సామూహిక దీపారాధన, మహాలక్ష్మీ పూజ.

K VENU, TIRUPATHI RURAL
Published on: 29 Nov 2026 6:07 PM IST
Tirupati
X

Tirupati: నవంబర్ 30న పరేడ్ మైదానంలో టీటీడీ కార్తీక మహా దీపోత్సవం

తిరుపతి: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో సోమవారం రాత్రి "కార్తీక మహా దీపోత్సవం" అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

దీపాల వెలుగులో మహిళా భక్తుల సామూహిక పూజ

వందలాది మంది మహిళలు ఒకే చోట చేరి సామూహికంగా దీపాలు వెలిగించేలా ప్రత్యేక దీపపు దిమ్మెలు, నేతి వత్తులను సిద్ధం చేశారు. భక్తులు సౌకర్యంగా కూర్చుని పూజలో పాల్గొనేందుకు మైదానమంతా తివాచీలు పరిచారు.

పుష్పాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా వేదిక

కార్యక్రమ వేదికను రంగురంగుల పూలతో, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. వేదికకు ఇరువైపులా ఆకట్టుకునే ప్రత్యేక అలంకరణలు చేశారు. ఉత్సవంలో భాగంగా నిర్వహించే శ్రీ మహాలక్ష్మీ పూజకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

పండుగ వాతావరణంలో ప్రాంగణం

టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ప్రాంగణం వరకు అరటి చెట్లు, పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించి పండుగ శోభ తీసుకొచ్చారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఆధ్యాత్మిక శోభ

కార్తీక మాస పవిత్రతను చాటుతూ, వేలాది దీపాల వెలుగులతో పరేడ్ మైదానం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని టీటీడీ కోరుతోంది

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL