Renigunta: రేణిగుంటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కలెక్టర్, ఎస్పీ స్వాగతం

Renigunta: తిరుపతి జిల్లా అధికారిక పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కలెక్టర్, ఎస్పీ ఘన స్వాగతం పలికారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Sept 2026 2:49 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కలెక్టర్, ఎస్పీ స్వాగతం

రేణిగుంట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుపతి జిల్లా అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆయనకు విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

​విమానాశ్రయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

​ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విమానాశ్రయం నుంచి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తన పర్యటన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత కార్యక్రమాలకు బయలుదేరి వెళ్లారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA