Tiruchanur: జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు తిరుచానూరు విద్యార్థిని ఎంపిక!

Tiruchanur: రాష్ట్ర స్థాయి అండర్-14 సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో తిరుచానూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని మోటుపల్లి చాందిని బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.

K VENU, TIRUPATHI RURAL
Published on: 25 Nov 2026 9:39 AM IST
Tiruchanur
X

Tiruchanur: జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు తిరుచానూరు విద్యార్థిని ఎంపిక!

తిరుచానూరు: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీ ఎస్.జి.ఎఫ్) ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలలో తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మోటుపల్లి చాందిని అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. 70వ జాతీయ స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలలో భాగంగా, అండర్-14 విభాగంలో చాందిని అద్భుతమైన ఆటతీరుతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం (బంగారు పతకం) కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ఆమె మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరగనున్న జాతీయ స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జాతీయ పోటీలకు అర్హత సాధించిన చాందినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పిఈటి), టెన్నిస్ కోచ్ కిరణ్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా చాందిని రాణించి పాఠశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL