Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో సింగపూర్ మంత్రి!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సింగపూర్ ఇంధన, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీలెంగ్ శుక్రవారం దర్శించుకుని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 20 Nov 2026 10:56 AM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో సింగపూర్ మంత్రి!

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సింగపూర్ ఇంధన, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీలెంగ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్, ఏవిఎస్వో శ్రీహరి రావు సూపరింటెండెంట్ రమేష్, తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL