Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి వెండి స్ఫటిక పాత్ర విరాళం!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ బి.శ్రీధర్ వర్మ శుక్రవారం రూ.5 లక్షల విలువైన 2.850 కేజీల వెండి స్ఫటిక పాత్రను విరాళంగా అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 20 Nov 2026 11:40 AM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి వెండి స్ఫటిక పాత్ర విరాళం!

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ బి.శ్రీధర్ వర్మ శుక్రవారం వెండి స్ఫటిక పాత్రను విరాళంగా అందజేశారు. సుమారు 2.850 కేజీ బరువున్న ఈ పాత్ర విలువ రూ.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ పాత్రను అమ్మవారి నిత్య కైంకర్యాల్లో వినియోగించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు లక్ష్మికాంత్, చలపతి పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL