Tirupati: తిరుచానూరు 4వ వార్డు మెంబర్ అభ్యర్థిగా సురేష్ నామినేషన్!

Tirupati: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ 4వ వార్డు మెంబర్ అభ్యర్థిగా కూటమి మద్దతుతో సురేష్ నామినేషన్ దాఖలు చేసి, ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు తెలిపారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 20 Nov 2026 11:20 AM IST
Tirupati
X

Tirupati: తిరుచానూరు 4వ వార్డు మెంబర్ అభ్యర్థిగా సురేష్ నామినేషన్!

తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ 4వ వార్డు మెంబర్ అభ్యర్థిగా సురేష్ నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ మద్దతు, కూటమి నాయకుల సహకారంతో తనను 4వ వార్డు మెంబర్ గా అభ్యర్థిగా నామినేషన్ చేసినట్లు కూటమి నాయకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, గ్రామ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ గ్రామాల పెద్దలకు, తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటనలో వివరించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL