Tirupati: టీడీపీ ఉపాధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం!
Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన కార్పొరేటర్లు రామాయాదవ్, కృష్ణ యాదవ్, ఆనంద్ యాదవ్‌లను యాదవ వీధి ప్రముఖులు ఘనంగా సన్మానించారు.
Tirupati: టీడీపీ ఉపాధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం!
తిరుపతి, నవంబరు 17: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్ ఇంటికి తరలివచ్చిన యాదవ వీధి చెందిన యాదవ ప్రముఖులు నూతనంగా జరిగిన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన కార్పొరేటర్లు నరసింహ యాదవ్ బ్రదర్స్ రామాయాదవ్, కృష్ణ యాదవ్ లను ఘనంగా సన్మానించడం జరిగింది.
కార్పోరేటర్ ఆనంద్ యాదవ్ ని కూడా సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గాలం కాంచన, గాలం నాగేశ్వర్ రావు, గాలం మునస్వామి, అయలా, దీన, దివ్య ,ఆనంద్ రాఘవ వెంకటేశ్వర్లు రాజు నాగయ్య సుబ్రమణ్యం వెంకటముని నవీన్ తదితరులు పాల్గొన్నారు.




