Tirupati: టీడీపీ జెడ్పీటీసి అభ్యర్థి ధనలక్ష్మి గెలుపునకు ప్రచారం!

Tirupati: తిరుపతి రూరల్ మండలం కొప్పరవాండ్లపల్లెలో టీడీపీ జెడ్పిటిసి అభ్యర్థి ధనలక్ష్మి తరఫున కూటమి నేతల ఇంటింటి ప్రచారం. భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 3 Nov 2026 12:29 PM IST
Tirupati
X

Tirupati: టీడీపీ జెడ్పీటీసి అభ్యర్థి ధనలక్ష్మి గెలుపునకు ప్రచారం!

Tirupati: తిరుపతి రూరల్ మండలం కొప్పర వాండ్ల పల్లె లో తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి మల్లవరం ఎంపీటీసీ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో కూటమి నేతలతో కలిసి టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి ధనలక్ష్మిని ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటి గడప తొక్కుతూ ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

కొప్పరమాండ్లపల్లె ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజల సమస్యలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయని విమర్శించారు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు డ్రైనేజీ రోడ్లు ఇతర మౌలిక వసతులు ప్రాధాన్యమిస్తామన్నారు జడ్పీటీసీ కూటమి అభ్యర్థి ధనలక్ష్మి విజయమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా . స్థానిక సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే కూటమి జడ్పీటీసీ అభ్యర్థులకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలిపి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI