Tirupati: తిరుపతి మేయర్గా శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ మేయర్గా విజయ
Tirupati: తిరుపతి మేయర్గా ఎం.శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ మేయర్గా పాలడుగు విజయ, 66 మంది కార్పొరేటర్లతో ప్రమాణం చేయించిన కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్.
Tirupati: తిరుపతి మేయర్గా శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ మేయర్గా విజయ
తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ గా ఎం. శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ మేయర్ గా పాలడుగు విజయలతో స్థానిక ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు డా.ఎం.వరప్రసాద్ సమక్షంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
సోమవారం స్థానిక ఎస్ వి యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియం నందు తిరుపతి నగర పాలక సంస్థ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఎస్ వి యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు డిప్యూటీ మేయర్ ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీనివాస ఆడిటోరియంలో నగర పాలక సంస్థ మేయర్ గా ఎన్నికైన ఎం.శ్రీనివాస ప్రసాద్ (అనే జే బి శ్రీనివాస్) చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అక్షర క్రమంలో ఒక్కొక్కరిగా 66 మంది కార్పొరేటర్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి తిరుపతి, చంద్రగిరి ఎం ఎల్ ఏ లు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర హస్తకళాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, ఎస్ వి బి సి ఛైర్మన్ శ్రీధర్ వర్మ, తిరుపతి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ యు. శారదాదేవి, స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్ ల కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎస్ వి సెనేట్ హాల్ నందు డిప్యూటీ మేయర్ ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఇందులో భాగంగా 35వ డివిజన్ నుండి ఎంపికైన జనసేన అభ్యర్థిని పాలడుగు విజయ పేరును డిప్యూటీ మేయర్ గా జనసేనకు చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ డి.నీతా పటేల్ ప్రతిపాదించగా, అదే పార్టీకి చెందిన 10వ వార్డు కార్పొరేటర్ పురిమిట్ల రాణి బలపరిచారు.
డిప్యూటీ మేయర్ పదవికి ప్రతిపాదిత అభ్యర్థి పాలడుగు విజయను 62 మంది కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిపి మొత్తం 63 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ ఎం. శ్రీనివాస ప్రసాద్, తిరుపతి ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, తిరుపతి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ యు. శారదాదేవి, స్మార్ట్ సిటీ జి ఎం చంద్రమౌళి, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




