Tirupati: ఎంపీడీవో ఆఫీసుల్లో పోస్టల్ బ్యాలెట్ సెంటర్లు!
Tirupati: తిరుపతి జిల్లా స్థానిక ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటుచేశారు నవంబర్ 2న ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు
Tirupati: ఎంపీడీవో ఆఫీసుల్లో పోస్టల్ బ్యాలెట్ సెంటర్లు!
Tirupati: జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఎన్నికల విధులకు నియమితులైన పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, ఇతర అధికారులు తమ సొంత నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేని పక్షంలో సంబంధిత మండల కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ కేంద్రాల్లో నవంబర్ 2, 2026 సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.




