Tirupati: తిరుపతి జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా బందోబస్తు!

Tirupati: తిరుపతి జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పరిశీలించి, సీసీ కెమెరాల నిఘాపై అధికారులకు సూచనలిచ్చారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 23 Oct 2026 4:10 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా బందోబస్తు!

Tirupati: తిరుపతి జిల్లా పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పరిశీలించారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, ప్రత్యేక పోలీసు బలగాల మోహరింపు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: ఎన్నికల సంఘం నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా పూర్తయ్యేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట ప్రత్యేక బలగాలను సమర్థవంతంగా వినియోగిస్తూ శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని, సంబంధిత అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత వారిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలి: ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL