Tirupati: కేవలం రూ.555కే 55 రకాల వైద్య పరీక్షలు - సంపూర్ణ ఆరోగ్య రక్ష

Tirupati: తిరుపతిలో రుద్ర నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.555కే 55కు పైగా ఆరోగ్య పరీక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 Oct 2026 5:20 PM IST
Tirupati
X

Tirupati: కేవలం రూ.555కే 55 రకాల వైద్య పరీక్షలు - సంపూర్ణ ఆరోగ్య రక్ష

తిరుపతి: పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో రుద్ర నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘సంపూర్ణ ఆరోగ్య రక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తుడా కార్యాలయంలో అధునాతన పోర్టబుల్ హెల్త్ స్క్రీనింగ్ మిషన్ డెమో నిర్వహించారు.

తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి ట్రస్ట్ ప్రతినిధులు స్వయంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పరికరం పనితీరును వివరించారు. సాధారణ ల్యాబ్‌లలో రూ.6,500కు పైగా ఖర్చయ్యే 55కు పైగా ఆరోగ్య పరీక్షలను కేవలం రూ.555కే అందించనున్నట్లు తెలిపారు.

పరీక్షలు పూర్తైన 5 నుంచి 10 నిమిషాల్లోనే డిజిటల్ రిపోర్టులను వాట్సాప్ ద్వారా అందిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, విద్యాసంస్థలు, ఉద్యోగ సంస్థల వద్దకు వెళ్లి ఈ సేవలను అందించేందుకు పోర్టబుల్ వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ సేవలను తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించి అభినందించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA