Tiruchanur: తిరుచానూరు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన కాళహస్తి సుభాషిని!
Tiruchanur: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు టీడీపీ ఎంపీటీసీగా కాళహస్తి సుభాషిని శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు.
Tiruchanur: తిరుచానూరు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన కాళహస్తి సుభాషిని!
తిరుచానూరు: తిరుపతి రూరల్ (మండలం) తిరుచానూరు టిడిపి ఎంపీటీసీగా కాళహస్తి సుభాషిని ప్రమాణస్వీకారం చేశారు. తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమెను రెండు నెంబర్గా రిటర్నింగ్ అధికారి ఆర్ యశ్వంత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం కాళహస్తి సుభాషిని మీడియాతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు తన పదవి కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు.
తిరుచానూరు గ్రామం లో నిలిచిపోయిన రోడ్లు డ్రైనేజీ కాలువ నిర్మాణాలను మండలం ప్రజా పరిషత్ నిధులతో నిర్మించే దిశగా చొరవ చూపుతానని ఎంపిటిసి కాళహస్తి సుభాషిని తెలిపారు. పలువురు ఎంపీటీసీలు స్నేహితులు బంధువులు ఆయనకు శాలువాతో సత్కరించి అభినందించారు.




