Tirupati: తిరుపతి రూరల్ సాయినగర్‌లో వైసీపీకి భారీ షాక్: టీడీపీలో చేరికలు!

Tirupati: చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సాయినగర్‌లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ సర్పంచులు సహా 30 మంది నేతలు ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 16 Nov 2026 11:57 AM IST
Tirupati
X

Tirupati: తిరుపతి రూరల్ సాయినగర్‌లో వైసీపీకి భారీ షాక్: టీడీపీలో చేరికలు!

తిరుపతి రూరల్, నవంబరు 15: చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సాయినగర్ మాజీ సర్పంచ్ డి.వి. రమణ, లింగేశ్వర నగర్ మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు తమ అనుచరులతో కలిసి సుమారు 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరినీ మన కుటుంబ సభ్యులుగా భావించాలని, పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి, ఐక్యంగా పోరాడి టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎమ్మెల్యే పులివర్తి నాని కి హామీ ఇచ్చారు.

చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL