Tirupati: అవిలాలలో రూ.2.36 కోట్ల సీసీ రోడ్లు ప్రారంభించిన పులివర్తి నాని

Tirupati: తిరుపతి రూరల్ అవిలాల, వేదాంతపురం పంచాయతీల్లో రూ.2.36 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 13 Oct 2026 7:35 PM IST
Tirupati
X

Tirupati: అవిలాలలో రూ.2.36 కోట్ల సీసీ రోడ్లు ప్రారంభించిన పులివర్తి నాని

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ లో నూతన సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కి సాదర స్వాగతం పలికిన అర్చకులు, మహిళలు, నాయకులు కార్యకర్తలు.

వేదాంతపురం పంచాయతీలో 19 పనులకు.....సుమారు 2 కోట్ల 36 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడమే మా లక్ష్యం అని పంచాయతీ ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే.

అనంతరం పంచాయతీలోని సమస్యలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. చిన్న..... చిన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమస్య పరిష్కారమయ్యే విధంగా చొరవ చూపుతా ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL