Tirupati: ప్రశాంతంగా తిరుపతి రూరల్ మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ!
Tirupati: తిరుపతి రూరల్ మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా జరిగింది. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, పులివర్తి సుధా రెడ్డి ఎంపీటీసీలను నడిపించారు.
Tirupati: ప్రశాంతంగా తిరుపతి రూరల్ మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ!
తిరుపతి: తిరుపతి రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), ఉపాధ్యక్షులు (వైస్ ఎంపీపీ) మరియు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించబడింది. తొలుత చంద్రగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించిన తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి,
తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి అనంతరం ఎంపీటీసీ సభ్యులందరితో పార్టీ కార్యాలయం నుండి తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వరకు కలిసి వెళ్ళారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా,ఎటువంటి ఒత్తిళ్లు లేదా అపోహలకు తావులేకుండా ఎంపీటీసీ సభ్యులందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి ఎంపీటీసీ సభ్యులందరూ ఒకే తాటిపైకి వచ్చి, క్రమశిక్షణతో ఎంపీడీఓ కార్యాలయానికి తరలిరావడం కూటమి ఐక్యతకు నిదర్శనమన్నారు.




