Tirupati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన కిషోర్ రెడ్డి!

Tirupati: తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీ హెలిప్యాడ్ వద్ద తిరుచానూరు టీడీపీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి స్వాగతం పలికారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 27 Nov 2026 8:47 AM IST
Tirupati
X

Tirupati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన కిషోర్ రెడ్డి!

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తిరుచానూరు 12వ వార్డ్ మెంబర్, తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా స్థానిక ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు ని తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తల్లి తిరుచానూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వడ్రాయన మునెమ్మ, తిరుచానూరు వార్డు మెంబర్లు మొట్టమొదటిసారి తిరుచానూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఏకీగ్రీవ ఎన్నిక కావడం విశేషం.

వారి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎమ్మెల్యే సతీమణి సుధా రెడ్డి, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, తిరుచానూరు క్లస్టర్ ఇంచార్జి, మధు శేఖర్, అల్మినేని మధు కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి కి స్వాగతం పలికారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL