Renigunta: పోలీసుల తీరుపై సర్పంచ్ అభ్యర్థి కుమార్తె వినిత వాగ్వాదం!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట జడ్పీ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద స్థానిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి జయలలిత కుమార్తె నగరం వినిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Nov 2026 10:46 AM IST
Renigunta
X

Renigunta: పోలీసుల తీరుపై సర్పంచ్ అభ్యర్థి కుమార్తె వినిత వాగ్వాదం!

రేణిగుంట: స్థానిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేణిగుంట జడ్పీ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ అభ్యర్థి జయలలిత కుమార్తె నగరం వినిత పోలీసుల విధుల నిర్వహణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలింగ్ కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఉన్నప్పటికీ పోలీసులు వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని నగరం వినిత ఆరోపించారు. ఒకరిని పోలింగ్ కేంద్రం వద్ద ఉండనిస్తూ, మరికొందరిని అక్కడి నుంచి ఎందుకు పంపిస్తున్నారంటూ పోలీసులను నిలదీశారు. "వారిని ఎందుకు అనుమతిస్తున్నారు? మమ్మల్ని మాత్రం ఎందుకు పంపిస్తున్నారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ క్రమంలో నగరం వినితకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడ కొంతసేపు అలజడికి దారితీసింది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA