Renigunta: రేణిగుంట సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత తరఫున పృథ్వీరాజ్ ప్రచారం!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో జనసేన కూటమి సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలితకు మద్దతుగా సినీ నటుడు పృథ్వీరాజ్ ప్రచారం నిర్వహించి, కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
Renigunta: రేణిగుంట సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత తరఫున పృథ్వీరాజ్ ప్రచారం!
రేణిగుంట: రేణిగుంట స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణిగుంటలో జనసేన పార్టీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత మద్దతుగా సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రేణిగుంటలో పర్యటించి అభ్యర్థి జయలలిత నగరానికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల గుర్తు కత్తెరపై ఓటు వేసి జయలలిత నగరాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సినీ నటుడు పృథ్వీరాజ్ రాకతో ఎన్నికల ప్రచారంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




