Renigunta: రేణిగుంట మండలంలో మొదటి రోజు మొత్తం 98 నామినేషన్లు నమోదు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు గాను మొదటి రోజు ముగిసే సమయానికి సర్పంచ్ పదవులకు 35, వార్డు సభ్యులకు 63 కలిపి మొత్తం 98 నామినేషన్లు దాఖలయ్యాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 15 Nov 2026 5:42 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో మొదటి రోజు మొత్తం 98 నామినేషన్లు నమోదు!

రేణిగుంట: 2026 గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసే సమయానికి రేణిగుంట మండలంలోని వివిధ గ్రామాల్లో అభ్యర్థుల నుంచి స్పందన లభించింది. అధికారుల తుది నివేదిక ప్రకారం, మొత్తం 19 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తంగా 98 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ పదవులకు 35 నామినేషన్లు రాగా, వివిధ వార్డు స్థానాలకు 63 నామినేషన్లు స్వీకరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA