Renigunta: రేణిగుంట మండలంలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 15 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Nov 2026 1:55 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్!

రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు నిర్ణీత సమయానికి ముగిసింది. మండలంలోని మొత్తం 19 గ్రామ పంచాయతీలకు గాను 4 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 15 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. 15 పంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. లెక్కింపు అనంతరం వెలువడనున్న ఫలితాల కోసం అభ్యర్థులు, గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA