Renigunta: కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే బొజ్జల పిలుపు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తివారిపల్లెలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Oct 2026 5:24 PM IST
Renigunta
X

Renigunta: కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే బొజ్జల పిలుపు!

రేణిగుంట: మండలంలోని గుత్తివారిపల్లె గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కొనసాగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA