Tirupati: తిరుపతి సీఆర్‌ఎస్‌లో రైల్వే కార్మికుల ‘ప్రొటెస్ట్ డే’

Tirupati: తిరుపతి క్యారేజీ రిపేర్ షాప్ (సీఆర్‌ఎస్) వద్ద సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు 'ప్రొటెస్ట్ డే' నిరసన చేపట్టారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Sept 2026 3:42 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి సీఆర్‌ఎస్‌లో రైల్వే కార్మికుల ‘ప్రొటెస్ట్ డే’

Tirupati: తిరుపతి క్యారేజీ రిపేర్ షాప్ (సీఆర్‌ఎస్) మెయిన్ గేట్ వద్ద సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రొటెస్ట్ డే’ నిర్వహించారు. వర్క్‌షాప్ డివిజన్ ప్రెసిడెంట్ కాళహస్తి బాబు, బ్రాంచ్ చైర్మన్ కే. సదాశివరెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

​ప్రధాన డిమాండ్లు:

​8వ వేతన సంఘాన్ని 3.86 ఫిట్‌మెంట్‌తో 01.01.2026 నుంచి వర్తింపజేయాలి.

​NPS, UPSలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలి; పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏ బకాయిలను చెల్లించాలి.

​టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-2లను విలీనం చేయాలి, బోనస్ సీలింగ్‌ను ₹21,000కు పెంచాలి మరియు క్యాడర్ రీ-స్ట్రక్చరింగ్ (CRC) అమలు చేయాలి.

​HRAను 20 శాతానికి పెంచడంతో పాటు ఔట్‌సోర్సింగ్, ప్రైవేటీకరణలను నిలిపివేయాలి.

​సీఆర్‌ఎస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి, అన్ని విభాగాల్లో కనీసం 50% ఇన్సెంటివ్ ఇవ్వాలి మరియు ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్యం, పాస్ సౌకర్యాలు కల్పించాలి.

​సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ట్రెజరర్ ముని కుమార్, ప్రతినిధులు రంగనాథం, చంద్ర నాయక్, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA