Tirupati: తిరుపతి జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ పోరు కలెక్టర్

Tirupati: తిరుపతి జిల్లాలో 777 పంచాయతీలకు 2 విడతల్లో ఎన్నికలు. మొదటి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండవ విడత నవంబర్ 29న. షెడ్యూల్ వెల్లడించిన కలెక్టరు వేంకటేశ్వర్.

K VENU, TIRUPATHI RURAL
Published on: 9 Nov 2026 6:50 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ పోరు కలెక్టర్

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) 14.10.2026న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తిరుపతి జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో 18 మండలాల్లో, రెండవ విడతలో 17 మండలాల్లో (మొత్తం 35 మండలాలు) సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు.

జిల్లా లో మొత్తము 807 గ్రామ పంచాయతీలకు గాను, 777 గ్రామ పంచాయతీలలో (7210 వార్డులకు) మాత్రమే ఎన్నికలు నిర్వహించుచున్నారు మరియు మిగిలిన 30 గ్రామ పంచాయతీలు వివిధ కోర్టు కేసుల వలన ప్రస్తుతము ఎన్నికలు నిర్వహించడంలేదు. నామినేషన్లు స్వీకరణకు మొత్తము 195 కేంద్రాలను ఏర్పాటుచేయడం జరుగుతుంది.

మొదటి విడత: 18 మండలాలలోని, 415 గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టులకు మరియు 3776 వార్డు మెంబరు సీట్లకు రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు 15.11.2026 (ఆదివారం)న జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 17.11.2026 (మంగళవారం), పరిశీలన 18.11.2026 (బుధవారం), తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లు 19.11.2026 (గురువారం), అప్పీళ్ల పరిష్కారం 20.11.2026 (శుక్రవారం).

అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ మరియు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన మరియు గుర్తుల కేటాయింపు 21.11.2026 (శనివారం). పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 26.11.2026 (గురువారం)న జరుగుతాయి. అవసరమైతే రీ-పోలింగ్ 27.11.2026 (శుక్రవారం)న నిర్వహిస్తారు.

మొదటి విడత మండలములు చిట్వేల్, కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, పుల్లంపేట, పుత్తూరు, వడమాలపేట, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి; రేణిగుంట, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, కె.వి.బి.పురం, నాగలాపురం, నారాయణవనం, పిచ్చాటూరు.

రెండవ విడత: 17 మండలాలకి గాను, 362 గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టులకు మరియు 3434 వార్డు మెంబరు సీట్లకు రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు 18.11.2026 (బుధవారం)న జారీ అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 20.11.2026 (శుక్రవారం), పరిశీలన 21.11.2026 (శనివారం), అప్పీళ్లు 22.11.2026 (ఆదివారం), అప్పీళ్ల పరిష్కారం 23.11.2026 (సోమవారం).

ఉపసంహరణకు చివరి తేదీ మరియు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన మరియు గుర్తుల కేటాయింపు 24.11.2026 (మంగళవారం). పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 29.11.2026 (ఆదివారం)న జరుగుతాయి. అవసరమైతే రీ-పోలింగ్ 30.11.2026 (సోమవారం)న ఉంటుంది.

రెండవ విడత మండలములు చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, రామచంద్రాపురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాలెం, చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ, బి.ఎన్.కండ్రిగ, సత్యవేడు, వరదయ్యపాలెం. డా. ఎస్. వేంకటేశ్వర్ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు, తిరుపతి జిల్లా.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL