Tirupati: నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న టీడీపీ ప్రజా మద్దతు!

Tirupati: సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి షాక్. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమక్షంలో వివిధ గ్రామాల నుంచి సుమారు 300 మంది టీడీపీలో చేరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Sept 2026 8:45 AM IST
Tirupati
X

Tirupati: నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న టీడీపీ ప్రజా మద్దతు!

​Tirupati: దొరవారిసత్రం మండలంలో టీడీపీలోకి భారీ చేరికలు – కల్లూరు, ఆనేపూడి గ్రామాల నుంచి 300 మంది పార్టీలో చేరిక.​సాదరంగా ఆహ్వానించిన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం,

​ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు

సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై దొరవారిసత్రం మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు.

​నాయుడుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో దొరవారిసత్రం మండలం కల్లూరు, ఆనేపూడి పంచాయతీలకు చెందిన సుమారు 300 మంది వైసీపీని వీడి అధికారికంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.​

ముఖ్యంగా కల్లూరు మాజీ సర్పంచ్ ఇట్టుగుంట పురుషోత్తం, ఆనేపూడి మాజీ సర్పంచ్ లింగారెడ్డి వెంకటరమణారెడ్డి, గొంజి మస్తాన్ తదితరులు తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ

గత ఐదేళ్ల అరాచక పాలనను తుదముట్టించి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుండటం చూసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని, కల్లూరు, ఆనేపూడి గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

​చేరిన నాయకుల అభిప్రాయం:

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తమ గ్రామాలు పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మౌలిక వసతుల కల్పనపై ఆశలు చిగురించాయని వారు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో తమ ప్రాంతాల అభివృద్ధి కోసం టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వేముసాని శ్రీనివాసుల నాయుడు, ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ విజయకుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జకరయ్య, మాజీ ఎంపీపీ ఇట్టుగుంట రత్నయ్య, మైనారిటీ అధ్యక్షుడు షబ్బీర్ భాష, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి డేగ ప్రసాద్ గారితో పాటు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్