Tirupati: విద్యార్థులకు అట్లాస్ పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ

Tirupati: తిరుపతి కరకంబాడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నందనం అకాడమీ అధినేత డా. వివేక్ పత్తిపాటి ఆధ్వర్యంలో 300 అట్లాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 Oct 2026 7:52 PM IST
Tirupati
X

Tirupati: విద్యార్థులకు అట్లాస్ పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ

తిరుపతి: నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి మూడవ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 300 అట్లాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నందనం అకాడమీ అధినేత డా. వివేక్ పత్తిపాటి మాట్లాడుతూ "పిల్లలకు అట్లాస్ పుస్తకం అనేది కేవలం పుస్తకం కాదు, ప్రపంచాన్ని చూసే కిటికీ అని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ విధంగానూ వెనుకబడకూడదనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేశామన్నారు.

శ్రీవారి ఆశీస్సులతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సంకల్పించామన్నారు. విద్యార్థులకు ఇవి ఎంతో అవసరమని గుర్తించి పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు

పుష్పలత, ఉపాధ్యాయులు రవీంద్ర, ముత్యాలరెడ్డి, నీలకంఠయ్య తదితరులు పాల్గొని డా. వివేక్ సేవలను అభినందించారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా అట్లాస్ పుస్తకాలు అందించడం ఎంతో అభినందనీయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA