Tirupati: తిరుపతి కార్పొరేషన్లో జనసేన బోణి: రేవతి ఏకగ్రీవం!
Tirupati: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్లో ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో కూటమి జనసేన అభ్యర్థి రేవతి ఏకగ్రీవమయ్యారు.
Tirupati: తిరుపతి కార్పొరేషన్లో జనసేన బోణి: రేవతి ఏకగ్రీవం!
తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన విజయాన్ని నమోదు చేసుకుంది. కూటమి అభ్యర్థిగా 65వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి జనసేన నేత సుధాకర్ సతిమణి శ్రీమతి రేవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై గడువు ముగిసే సరికే 65వ డివిజన్లో ప్రత్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో ఈ స్థానం ఏకగ్రీవమైంది. దీనితో పోలింగ్ తేదీకి ముందే తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో జనసేన పార్టీ తొలి విజయాన్ని సాకారం చేసుకొని ఖాతా తెరిచింది. ఈ పరిణామంతో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, కూటమి ప్రభుత్వం పై ఉన్న నమ్మకంతోనే తిరుపతిలో మొదటి విజయం సాధించామని జనసేన-కూటమి నాయకులు, కార్యకర్తలు రేవతి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.




