Tirupati: అలిపిరి వద్ద కొప్పెర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులకు అన్నదానం!
Tirupati: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ సందర్భంగా అలిపిరి వద్ద కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సాయి సురేష్ బృందం అన్నదానం నిర్వహించారు.
Tirupati: అలిపిరి వద్ద కొప్పెర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులకు అన్నదానం!
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజైన గరుడసేవ కు భక్తులు అధిక సంఖ్యలో తిరుమల వెళ్తున్న సందర్భంగా తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కొప్పర వాండ్ల పల్లె కు చెందిన సాయి సురేష్ అతని మిత్రబృందం కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి సురేష్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా శ్రీవారి భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేయడం ఆనవాయితీ అన్నారు.
అందులో భాగంగా నేడు 600కు పైచిలుక భక్తులకు వివిధ రకాల ప్రసాదాలను వితరణ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పర్వదినాల సందర్భంగా మరింత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రుక్మిణమ్మ. మరియు చంద్రమోహన్. తనుజ ద్వారక నాగ సురేష్ రాజేశ్వరి శైల రమణి మురళి . మహా వాణి తదితరులు పాల్గొన్నారు.




