Tirupati: కాలూరులో ఘనంగా వినాయక నిమజ్జనం

Tirupati: తిరుపతి రూరల్ మండలం కాలూరులో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం. రూ.77 వేలకు వినాయక లడ్డూను దక్కించుకున్న మల్లెల అయ్యప్ప. హాజరైన టీడీపీ నేత మనోహర్ చౌదరి.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 20 Sept 2026 9:30 PM IST
Tirupati
X

Tirupati: కాలూరులో ఘనంగా వినాయక నిమజ్జనం

తిరుపతి: తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కాలూరు కూడలిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయక స్వామి ప్రతిమ నిమజ్జన మహోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మల్లవరం టిడిపి జిల్లా కార్యదర్శి మనోహర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికి దుస్యాలువాతో సత్కరించారు. అనంతరం స్వామి వారి ప్రతిమ వద్ద నైవేద్యంగా ఉంచిన 25 కే జీల లడ్డు ప్రసాదం వేలం నిర్వహించారు వందలాది మంది స్థానిక ప్రజలు ఈ వేలం పాటలో పాల్గొనగా కాలూరు గ్రామానికి చెందిన. మల్లెల అయ్యప్ప . స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని వేలం పాటలో 77 వేల రూపాయలకు దక్కించుకున్నారు. ముఖ్య అతిథులు చేతుల మీదుగా లడ్డు ప్రసాదాన్ని మల్లెల అయ్యప్ప కి వినాయక చవితి కమిటీ సభ్యులు అందజేశారు.

అనంతరం. భాజా భజంత్రీల నడుమ లడ్డు ప్రసాదాన్ని అక్కడి నుండి ఊరేగింపుగా మల్లెల అయ్యప్ప ఇంటి వద్దకు తీసుకువెళ్లారు అనంతరం స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మనోహర్ చౌదరి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాలూరు లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అన్నారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని భక్తులు వేలాది రూపాయలు పెట్టి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలూరు ఆర్కే నగర్ యువత. ధనంజయులు సోమశేఖర్, హితేష్ హర్షవర్ధన్, సేతు వర్ధన్ రెడ్డి, శివ, మహేష్, సాయి. నవీన్ చింటూ తదితరులు పాల్గొన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI