Tirupati: తిరుపతి తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా హెచ్. హేమలత ప్రమాణ స్వీకారం
Tirupati: తిరుపతి జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా హెచ్. హేమలత, వైస్ చైర్మన్‌గా ఎ. కిషన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికై కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం.
Tirupati: తిరుపతి తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా హెచ్. హేమలత ప్రమాణ స్వీకారం
తిరుపతి: శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు ఎం. వరప్రసాద్ సమక్షంలో జిల్లాలో నూతనంగా ఎంపికైన జెడ్పిటిసిల తో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇందులో భాగంగా నూతనంగా ఎంపికైన 35 జెడ్పిటిసి లలో 30 మంది ప్రత్యేక సమావేశానికి హాజరు కాగా వీరందరితో సభ్యుల అంగీకారం మేరకు జిల్లా కలెక్టర్ సామూహిక ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం తెలుగు దేశం పార్టీ నుండి అధ్యక్ష పదవికి నాగలాపురం జెడ్పిటిసి హెచ్. హేమలత నామినేషన్ అందగా సభ్యుల ఆమోదంతో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా హెచ్.హేమలత ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ ఛైర్మన్ పదవికి భారతీయ జనతా పార్టీ నుండి సూళ్ళూరుపేట జెడ్పిటిసి ఆరణి కిషన్ రెడ్డి నామినేషన్ అందగా సభ్యుల ఆమోదం మేరకు వైస్ ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన జెడ్పి చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ మరియు ఇతర జెడ్పిటిసి లకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి బి.కళ్యాణ్ చక్రవర్తి, సూళ్లూరపేట, కోడూరు ఎం ఎల్ ఏ లు నెలవల విజయశ్రీ, అరవ శ్రీధర్ జెడ్పిసిఈఓ టిఎన్ శోభన్ బాబు, డిప్యూటీ సిఈఓ రమణ ప్రసాద్, జెడ్పి అధికారులు మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్ పి టి సి ల వివరాలు:
టిడిపి :
1. అనిత సన్నా రెడ్డి, వాకాడు
2. కననెమ్మ తుపాకుల, నాయుడు పేట
3. కవిత కీర్తి పాటి, ఓబులవారి పల్లె
4. కొండే పాటి మధుమతి, చంద్రగిరి
5. పి. గిరిబాబు, నారాయణవనం
6. గోనుగోడుగు సురేష్, బాలాయపల్లి
7. చింతల శివరాజి, వెంకటగిరి
8. చేతన పనబాక, శ్రీ కాళహస్తి
9. జీవ అంబాకం, తడ
10. తిరుమల రెడ్డి మేకల, రామచంద్రా పురం
11. తుపాకుల శశి రేఖ, ఓజిలి
12. నంగ పద్మజ రెడ్డి, పాకాల
13. పూల మునిరాజ, ఏర్పేడు
14. పేళ్లురు సౌజన్య, చిట్టమూరు
15. ముద్దా సుభాష్ రెడ్డి, పుల్లంపేట
16. మొగిలి కల్పన, కే వి బి పురం
17. రావిళ్ళ ముని రాజా నాయుడు, తొట్టంబేడు
18. టి. వెంకతమ్మ, బుచ్చి నాయుడు కండ్రిగ
19. వేమసాని సుభాషిణి దొరవారి సత్రం
20. సర్వే పల్లి రత్నయ్య, డక్కిలి
21. ఎం. సుజాత, పుత్తూరు
22. వి. సుమలత, పిచ్చాటూరు
23. హెచ్ సోనియా, సత్యవేడు
24. పి. హేమావతి, వడమాలపేట
వై ఎస్ ఆర్ సి పి
1. అంబటి మురళి, కోడూరు
2. సుప్రజా దువ్వూరి, పెనగలూరు
జనసేన పార్టీ
1. తాత శ్రీనివాసులు, వరదయ్యపాలెం
స్వతంత్ర అభ్యర్థి
1. గుత్తి నరసింహులు, చిట్వేల్




