Tanapalli: తనపల్లి సర్పంచ్‌గా మాజీ సైనికుడు కే.కే. మురళి ఏకగ్రీవ ఎన్నిక

Tanapalli: తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో మాజీ సైనికుడు కే.కే. మురళి ఏకగ్రీవం; ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 24 Nov 2026 7:32 PM IST
Tanapalli
X

Tanapalli: తనపల్లి సర్పంచ్‌గా మాజీ సైనికుడు కే.కే. మురళి ఏకగ్రీవ ఎన్నిక

తనపల్లి: తనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మాజీ సైనికుడు కే.కే. మురళి ఏకీగ్రవ ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ మద్దతు, కూటమి నాయకుల సహకారంతో తనను సర్పంచ్ గా ఏకీగ్రవ ఎన్నిక చేసిన కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కే.కే. మురళి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కి గ్రామ పెద్దలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

అలాగే తనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల పెద్దలకు, తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటనలో వివరించారు. పదవి కోసం కాదు. ప్రజాస్వామ్య ముఖ్యమని భావించి ఎన్నికల బరిలో దిగడం జరిగింది.

తనపల్లి పంచాయతీ అభివృద్ధి మా ప్రధాన కర్తవ్యం. మాటల్లో చెప్పే వాళ్ళము కాము, చేతిల్లో చేసి చూపిస్తాము. అధికారం శాశ్వతం కాదు, ప్రజల అభిమానం, ఆదరణ శాశ్వతం. దశాబ్ద కాలంగా ఉన్న అవినీతిని అంతం చేసి చూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL