Srikalahasti: శ్రీకాళహస్తి ఎంపీపీగా తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి ప్రమాణం!
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండల ఎంపీపీగా తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీగా దొరై రాజు గురువారం ఎంపీడీవో కార్యాలయంలో కోలాహలంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Srikalahasti: శ్రీకాళహస్తి ఎంపీపీగా తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి ప్రమాణం!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మండలం లో ఉన్న 15 ఎంపీటీసీలు 14 టిడిపి 1 బిజెపిఎన్నికలలో ఏకీగ్రీవం అయినా ఎంపీటీసీ లు, రవీంద్రనాథ్ రెడ్డి ని MPP గా ఎన్నుకోగా వైస్ MPP గా దొరై రాజు ని ఎన్నుకున్నారు. శ్రీకాళహస్తి ఎంపీడీవో కార్యాలయంలో ప్రమణ స్వీకారం అనంతరం ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి మొదటి సంతకం చేశారు. ఆయన మాట్లాడుతూ తనను ఎంపీపీగా ఎన్నుకున్న ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు.
తన మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారి కుటుంబానికి రుణపడి ఉంటానని ఆయన తెలియజేశారు. అన్ని పంచాయతీలు ఏకగ్రీవం అవడం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన అభివృద్ధినే నిదర్శనం అన్ని కొత్తగా ఎంపికైన ఎంపీపీ రవీంద్రారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




